అ౦త: కా౦క్ష (INNER DESIRE) Poem by suresh CV chennuru vankadara

అ౦త: కా౦క్ష (INNER DESIRE)

సి.వి.సురేష్ || అం తః కాం క్ష (లోపలి కోరిక) ||

'నన్ను క్షమించవా? ' ఆ మొదటి రాత్రి అతడన్న మాటలు
ఎడారిగాలుల్లా ఇప్పటికీ బాదుతూనే ఉన్నాయి
కొర్కెల కొంగున వేసుకొన్న ముడి కాళ్ళకడ్డుపడింది

గది నిండా ఊడలతో ఆ వృక్షం
రాత్రంతా కురుస్తూనే ఉన్న‌ తెల్లటి మంనచును స్పర్శిస్తూనే ఉదిో

ఆ గది చేరుకున్న‌నదులు చెరొక ప్రక్కన‌ మౌనంగా
ఘనీభవించి నిశ్శబ్ధంగా ప్రవహించుకొంటున్నాయి
ఉద్వేగాల ఉత్సుకతల తీరాల్ని తగలకుండానే

ఆ ఉదయం ఆమెను చూసిన ప్రతి చూపు బాగా జ్ఞాపకమే
ఏది ఒక్కసారి ఆ సిగ్గుల మొఖం చూపించూ

లోపల్నుండి దావానలంలా ఉష్ణ ప్రవాహం
ఆమెకు గుండెలవిసి పోవాలని లేదు
ఏడ్వాలని లేదు
అప్రయత్నంగానే కన్నిళ్ళను కుక్కుకొంది
ప్రవహించలేని నదిలా
ఒక ప్రాణమున్న శిలగా ఆమె

ఎండిన నదిలో
ఇమడని ఆ ప్రవాహం ఇక పూలు పూయదు
ఆ గది అంతః కాంక్ష కు ఆమె బందీ గా మారింది
అమెను ఒక అరిష్టంగా మార్చింది! ! ! !
@ సి.వి.సురేష్

POET'S NOTES ABOUT THE POEM
WHEN A HUSBAND SAYS SORRY OF HIS IMPOTENCY ON THE VERY FIRST NIGHT OF A WOMEN! THE PATHETIC CONDITION OF THAT WOMAN
COMMENTS OF THE POEM
Srininivas Reddy Paaruvella 15 November 2016

goof one Suresh gaaru , chaala baagundi

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success