మా ర్పు (THE CHANGE) Poem by suresh CV chennuru vankadara

మా ర్పు (THE CHANGE)

సి.వి.సురేష్ || మా ర్పు (c h a n g e) ||

ఎంతటి దుస్స్వప్నాల్లోనైనా
నీ ఎడబాటు నేనెప్పుడూ చూడలేదు

మ౦డు వేసవి లో కూడా
నీ సహచర శీతల సమీరాలను అనుభవి౦చాను

నేను బాగా విసుగెత్తిన క్షణాల్లో సైతం
నీపై చిగురంత కోపం రాదేమని ఆశ్చర్యమేసేది

మనసెప్పుడైనా కలతపడితే
నీపై నే రాసిన కవితను పాటగా మార్చుకొని
ఒంటరిగా వేణువూదుతూ సేదతీరేవాడిని

నిను నవ్వించాలనో నీలో ఆసక్తి కలిగించాలనో
నీతో మాటలు పెంచాలనో నీకెలా ఇష్టమైతే అలా మెలగాలనో
నేనో రకమైన ఉత్సాహం చూపేవాడిని

నాకింకా గుర్తే!
నాలో ఈ మార్పులన్నీ నీకెప్పుడైనా చెపితే
అదో రకమైన expression ఇచ్చేదానివి
నీవు గర్వంగా ఫీల్ అయ్యేదానివో?
నన్న్నభినందిస్తున్నావో నాక‌ర్థమయ్యేది కాదు

నాకు బాగా తెలుసు
నన్ను నీవు చాలా ఇష్టపడేదానివని
మౌనంగానే చిరునవ్వుతో ఆ భావాన్ని పలికించేదానివి

2
కానీ, ఇప్పుడు
నాకెందుకో ఆ జ్ఞాపకాలంటేనే భయం! ! !
నను కమ్ముకోవాలనే చూసే
ఆ జ్ఞాపకాల నుండి దూరంలగా వెళ్ళిపోతున్నాను
నిజ౦ చెప్పాల౦టే పారిపోతున్నాను
నాలో ఎంత మార్పు?

సివి.సురేష్

COMMENTS OF THE POEM
Padmapadmapv 24 February 2019

మార్పు, ఎవరికీ అయినా, సహజం అయినా ఈమార్పు. నాకు, నచ్చదు.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success