ప్రేమ గీతిక (THE LOVE SONG) Poem by suresh CV chennuru vankadara

ప్రేమ గీతిక (THE LOVE SONG)

సి.వి.సురేష్ || ప్రేమగీతిక ||
.
విస్తరించిన బాహువులతో
నీవెప్పుడూ నన్నాహ్వానిస్తూనే ఉన్నావు

మునివ్రేళ్ళపై నిలబడిన నీ ప్రేమ‌
నా కోసం ఎదురుచూస్తున్నట్లనిపించింది

మెల్లగా కదులుతున్న నీ లేతపెదవులు
ఏదో చెప్పాలనుకుంటున్నట్లనిపిస్తే
పెదవి దాటని ఆ భావలేవో
చప్పుడు చేయకుండా నామనసుతో గుస గుస లాడుతున్నాయి

తెలియని ఒక మధురభావన‌
నన్ను నన్నులా ఉండనీయడం లేదు

ఇప్పుడు చిన్నగా
నీ సంతోషంలో
నే పారవశ్యం కావాలనుంది

నీ బాధల్లో
నే ఆసరా అవ్వాలనుంది

నీ అందాలకు నే అంతర్ సౌందర్యాన్నై
నీకు నేనే చిరునామా కావాలన్న అత్యాశ

అద్వితీయ ప్రేమలో
మన ఇరువురమే మిగలాలన్న స్వార్థం

సరే! చివరగా అడుగుతున్నా!

ఒకరినొకరం ప్రేమ ను ఇచ్చి పుచ్చుకుందామా?
ఖచ్చితంగా చెప్తున్నా
' ప్రేమ' ఎప్పుడూ పశ్చాత్తాప పడదు!

COMMENTS OF THE POEM
Padmappadmapv 26 April 2019

Excellent, all poems. సర్.అభినందనలు

0 0 Reply
Padmapadmapv 24 February 2019

ప్లీజ్, కవిత బాగుంది. Naaku, nachindi.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success