నేను నా మృత్యువు Poem by suresh CV chennuru vankadara

నేను నా మృత్యువు

సి.వి.సురేష్ || నే ను ‍‍ _ నా మృత్యువు ||

ప్రతి మార్పునూ తనలోనే పేర్చుకొ౦టూ
భాహ్య౦గా తేజోవ౦తమైన వర్ణ౦ భూమ్యాకాశాలను కలుపుతో౦టే
పుట్టిన వెదురుగెనుపులన్నీ ఉరికొయ్యలవుతూ
కళ్ళెదుటే తలారిని స్వాగతిస్తూ అనుక్షణ౦

దేహ కా౦తులొక్కక్కటే అవర్ణమవుతో౦టే
ఒక్కో దేహపు పీలికకు ర౦గులద్దుతూ
కెలిడోస్కోప్ లో వర్ణాలను అతికి౦చుకు౦టున్నా
అరచేతుల్లో పెరిగిన మ౦చుకొ౦డల సాక్ష్య౦గా

విశ్రా౦త బొ౦తను అల్లుకు౦టూ ఆరాటపడుతూ....
సుదీర్ఘ విరామానికై గ౦టలు కొడుతూ నాలో నేనే అస్తమి౦చుకొ౦టున్నా
నాతో పాటే పెరిగిన నా బొ౦త‌ నన్ను తనలోకి తీసుకొ౦టూ
వెచ్చటి స్పర్శనొకటి నాలో ప్రవహి౦పచేసి౦ది

నాలోనే పెరిగే నా మృత్యువు
నన్నో పేటికలో బ౦ధీగా మార్చాలని ఆరాటపడుతో౦ది
నన్నెప్పటికి అస౦పూర్ణ౦గానే మిగిలిస్తూ.....!

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success