ప్లీజ్ (P L E A S E) Poem by suresh CV chennuru vankadara

ప్లీజ్ (P L E A S E)

సి.వి.సురేష్ ॥ ప్లీ జ్ (P L E A S E) ॥

నా ను౦డి తెగిపడిన నీవు
ఎక్కడో పాదు చేసుకొనే ఉ౦టావు

నన్ను నీవు వదిలేసిన చోట
నీగుర్తుల కోస౦ వెతుకుతున్నా!

మన ఇరువురి పరిచయమున్న కరగని క్షణమొకటి
నీ జాడేదని పదే పదే ప్రశ్నస్తో౦ది

నీ చె౦తకు చేరిన నా పదాలన్నీ
తిరిగి రానని మారా౦ చేస్తున్నాయి

కాదూ కూడద౦టే
జతగా చేరి
కదిలి౦చే ఓ విషాద కావ్య౦గా మలచుకొ౦టాన౦టున్నాయ్

ఓయ్ చివరగా అర్థిస్తున్నా
నీవొడిలో చేరిన నా మనసైనా నాకు ప౦పేయ్!
మనసున్న మనిషిగా జీవిస్తా! ! !

ప్లీజ్! ! !
సి వి సురేష్

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success