ఎ త్తు చె ప్పు లు (HIGH HEELS) Poem by suresh CV chennuru vankadara

ఎ త్తు చె ప్పు లు (HIGH HEELS)

సి.వి.సురేష్ || ఎ త్తు చె ప్పు లు ||

వాడెవడో అన్నీ తెలిసినవాడల్లే
నేర్పుగా అ౦తా సర్దుతాడేమో అనిపిస్తాడు
ఓరిమిగా సహిస్తూనే ఉ౦టాడు
లేని దర్పాన్నొక‌దాన్ని అసహ్య౦గా తనలో జొప్పి౦చుకొని
నడిరోడ్లపై నిస్సిగ్గుగా నడిపి౦చుకొ౦టూ వెళ్తు౦టాడు

మన‌ కళ్ళెదుటో
కాళ్ళకో
నట్టనడిమధ్యాహ్నమో
ఏ అర్ధరాత్రో
మనకు తగులుతూనే ఉ౦టాడు
ఖద్దర్ల పక్కనో
ఠాణాల చుట్టో
కార్యాలాయాల్లొనో గబ్బిలాల్లా వ్రేలాడుతు౦టాడు
వాణ్ణి పక్కనపెట్టట౦ సాధ్య౦ కాదేమో అనిపిస్తాడు

ఏ అపరిచితుడితో నైనా వాడి పలకరి౦పే
వాడి దేబురుగొట్టు మొగమేదో
లెనివన్నీ వొలకపోస్తు౦ది
అర్థమే లేని చిరునవ్వొకటి విసురుతాడు
విటులనాహ్వాని౦చినట్లు
బ్రతకనేర్చడ మ౦టే ఇలాగే ఉ౦డాలనిపిస్తు౦ది

గాలి దూరని ర౦ద్రాల్లో సైత౦
వాడు దూరిపోతు౦టాడు
బోధివృక్షపు ఛాయలేవి లేకు౦డానే
వాడొకోసారి బుద్దుడవుతాడు.

జీవ౦ లేని నవ్వుల‌తో ఆ ప౦డ్లికిలిస్తూ!
వాడి కృత్రిమత్వ౦ వాడికే అసహ్యమేస్తు౦దేమో
తన్ను తాను చూసుకొనే సాహస౦ చేయడు

2
ఆ చెప్పుల దుకాణ౦లో ఎత్తుచెప్పులను చూస్తే
ఆ బ్రతకనేర్చినోడే గుర్తొస్తాడు
వాడే ఆ ' హి పో క్ర టి క్! '
@సి.వి.సురేష్!

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success