నిజ స్వరూపం Poem by Thati pramod sai

నిజ స్వరూపం

నా నీడ కూడా నన్ను వెక్కిరిస్తుంది
నిమిషం కూడా నా నిజం లా నేను ఉండలేకపోతున్నా అని
ఒక నిప్పులాంటి నిజం నా నీడని సైతం దహించి వేస్తుంది
దయలేని ఈ సమాజం నీలా నిన్ను బ్రతుకనివ్వదు
నిన్ను నిన్నుగా ఈ సమాజాం ఉండనివ్వదు
మెప్పించడం కోసం రంగులద్దడం ఎప్పుడైతే అలవాటయిందో
నువ్వు వేస్తున్నది వేశామని తెలుసుకోలేవా
నాటకాల ప్రవాహం లో నీ నిజ స్వభావాన్నే మర్చిపోయావా
ఎందుకంత మౌనం నీ నిజ స్వరూపం చివరికి తెలిసిందనా
అది కుడా నువ్వు ఎప్పుడో అప్పుడు వేసిన వేషం అనుకుంటున్నావా? ?

Thursday, July 20, 2017
Topic(s) of this poem: life
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Thati pramod sai

Thati pramod sai

Hyderabad
Close
Error Success