అమ్మకి ప్రేమతో (Telugu) Poem by Thati pramod sai

అమ్మకి ప్రేమతో (Telugu)

అమ్మ గురించి రాయాలని కూర్చున్నా
ఆకాశమంత భావాలను కవితగా మార్చి
ప్రణవ క్షరానికి ప్రణమిల్లి రాయాలని ఉన్నా
ప్రేమగా ప్రతి పదాన్ని నా ప్రాణంతో అల్లి
నా ప్రతి ఆణువణువూ పులకించి పలుకుతుండగా
వర్ణమాల లోని వర్ణాలన్నీ వేదాలలా కదులుతుండగా
ఇంద్ర ధనుస్సు సిరాగా మారి నా యెదలో చేరుతుండగా
నా మనసు దూది పింజం లా మారి విహరిస్తుండగా రాస్తున్నా అమ్మకి ప్రేమతో ఒక కమ్మని కవిత
అద్వితీయమైన అజరామరణమైన తియ్యని చరితా...
***

గుడి అనుకుని నిద్రిస్తుండ నేను
నీ ఉదరమున పరవశించి మేను
సర్వ జగత్తు నీలో నిమిిడి ఉండ
భయాలు నాకేల నీ స్పర్శ నుండ
నీ గుండె చీల్చి, నీ ఊపిరి పీల్చి
లోకం మరిచి, శోకం మరిచి
అరిచా మౌనంగా నీకై పిలిచి..

కనిపించని దేవతకై కనుమూసి కలలు కన్నా
నీ రూపు చూపుకై ప్రార్థిస్తూ వేచి ఉన్నా నీ మాటల వినికిడి మౌనంగా నవ్వుతున్నా
నీ ప్రాణం గా నీలో నే నిర్మలంగా నిదురిస్తున్నా
మరో ప్రాణంగా అనుక్షణం చిగురిస్తూనే ఉన్నా...

నవ మాసాలే నిండగా
వేదనలో నీకొక పండగ
మన ఇరువురిని వేరు
చేసిన లోకాన్ని చూసి
నేను కార్ కార్ మనగా
ఆప్యాయంగా కన్నీళ్లతో నవ్వేవు..
అమ్మా!
నా లేత కనులు కనుగొన్న
మొదటి అందానివి నువ్వు
మెత్తని నీ కౌగిలి ఏ లోకాలు సరికావు
కమ్మని నీ చనుబాల తీపికి అమృతమే
చిన్నబోగా
ఏ స్వర్గ సీమ సరికాదు నీ చల్లని ప్రేమకి
ఉషస్సు యశస్సులా, ఆప్యాయతల ఆకాశంలా, సప్త సముద్రాల ప్రేమలా, గుప్త నిధుల మమకారంలా
బ్రహ్మ వాక్కే నీ నామంగా నా నోటి నుండి పలుకగా
త్రిమూర్తులే మాతృమూర్తిగా నా యందు నిలవగా
ఏమని రాసేను, ఏమని పొగిడెను
ఏమని పలికెను, ఏమని పాడెను..
అమ్మంటే ప్రేమే అనేనా, అమ్మంటే ఆప్యాయతే అనేనా..
అమ్మే దేవత అనేనా, లేక దేవతే అమ్మ అనేనా?
నా కనుపాపలు కమలములుగా మారి నీ చరణములపై ఆనంద భాష్పాలు రాలుస్తుండగా
ఎన్ని జన్మలకు తీర్చెను నీ ఋణం?
మల్లి నీ ఒడిలో జన్మించుటకు ప్రార్ధించడం తప్ప అనుక్షణం
ఏ బహుమానం ఇవ్వాలన్నా స్ఫూరించడం లేదు
ఏ ఆలోచనా ఇందుకు సరికావడం లేదు
అందుకే రాస్తున్నా ఒక చిన్న కవిత
ముల్లోకాలు నీ పాదాల చెంత ఉండగా నిరంతర సేవాన్ముక్తుడనై కలకాలం నీ సేవ చెయ్యనా
నిశ్చింతగా నీ ఒడిలో మెదిలే బొమ్మలా శాశ్వతంగా నిదురించానా......

ఇట్లు
అమ్మకి ప్రేమతో
ప్రమోద్ సాయి.

Sunday, May 14, 2017
Topic(s) of this poem: mother,mothers day
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success