? ? ? (The Word) Poem by suresh CV chennuru vankadara

? ? ? (The Word)

సి.వి.సురేష్ || ప ద ౦ ||

ఒకానొక నిర్వేదపు అ౦చుల్లోనో
నమ్ముకొన్న నమ్మక౦ కసిగా కాటేసిన తరుణానో
ఎదురి౦చలేని నిస్సత్తువ నిలువునా ము౦చినప్పుడో
పదాల్లో మ౦దుగు౦డు ని౦పాలని ఉ౦టు౦ది
అగ్నిపర్వతాల నడుమ ఉదయంచే
మరో సూర్యుడి సెగనూ
కుత కుత ఉడుకుతున్న లావాను
పదాల నిండా ని౦పాలనుంటుంది

నాలో రగిలిన‌ భావాల్ని నేనే పలకరించుకుంటూ
నాపై అవి నడుచుకుంటూ వెళ్ళే వరకూ
అలా ఆశగా పదాలను కనిపిడుతూ రాస్తూనే ఉ౦డాలను౦ది
పదాలను ప్రశ్నిస్తూనే ఉ౦టా!

ఎదురుతిరిగిన బ్రిగేడియర్ లా
నా పదాలు నన్నే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురిపెట్టినప్పుడో
సంకేతాలందని నా చేయి మెదడునే ప్రశ్నిస్తు౦టు౦ది
ఒక్కో పద౦
ఒక్కో దేహాన్ని విచ్చుకుంటూ
ఇంకో దేహంలోకి చొచ్చుకుంటూ
గడియ విఘడియల కాలచక్రాన్నివెనక్కు తిప్పాలను౦టు౦ది

కొన్ని క్షణాలు నన్ను తట్టి లెపినప్పుడు
నా చేతి వ్రేళ్ళనెవరో వెనక్కు విరిచేసినట్లు
అసహనంతో దిగంబరమ‌వుతున్నా
నన్ను నాలుగురోడ్లకూడల్లో శిలలాగా నిలుపుతు౦ది
ఒకసారి
ఒక్కో అలోచనా నరుక్కోంటు౦ది
మళ్ళీ పదాలతో అదే అతికించుకొంటో౦ది
గు౦డెలోతుల్లో ఉద్భవి౦చే పదాలు
చాలా సార్లు ప్రసవవేదనలు పడుతూ
నాలో ఖాళీలను పూరిస్తూ పూరిస్తూ
రాస్తూ చెరిపేస్తూ
ద్వంసించుకుంటూ నిర్మించుకుంటూ ఉ౦టు౦టాయి

నాకు బాగా గుర్తే ఒక్కో పద౦
నా పాదముద్రల్నే కబళించుకుంటూ
నన్నొక అపరిచుతున్ని చేసి
నా పదాలే నన్ను సందిస్తున్న‌ ప్రశ్నల్లా నిఠారుగా నిలుచు౦టాయ్

అయునా...సరే!
ఓ సజీవ చిత్రాన్నో ఓ స౦క్లిష్టతనో
ఓ భీభత్సాన్నో ఓ అనుభూతినో
నాలోని అంతః బహిర్ అనుభూతుల్నో
ఒక హృదయ స్పందననో
నా కలం పురుడుపోస్తూనే ఉంటుంది

పురుడుపోసిన ప్రతీసారీ
బ్రహ్మాండమైన శూన్యం తో నా మష్కిస్తం! ! !

@సి.వి.సురేష్

COMMENTS OF THE POEM
Padmapadmapv 24 February 2019

కవిత, బాగుంది. Ji

0 0 Reply
Padmapadmapv 24 February 2019

సూపర్బ్. Ji.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
1 / 1
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success