The Queen Poem by suresh CV chennuru vankadara

The Queen

సి.వి.సురేష్ || రాణి.||
1
నిన్నో రాణి గా నే అభివర్ణి౦చాను.
అక్కడ నీకన్నా పొడువైన సోగసరులున్నారు...
అక్కడ, నీ కన్నా స్వచ్చమైనపవిత్రులున్నారు...
అక్కడ, నీ కన్నా అందమైన ఆడవాల్లున్నారు....
కానీ, నీవే రాణివి...!
2

నీవలా వీధుల వెంట నడిచి వెళ్తే...
నిన్నెవరూ గుర్తించరు...
నీ స్పటిక కిరీటాన్ని ఎవరూ చూడరు..
దివ్య ఎర్రటి బంగారు తివాచి ని కూడాచూడరు..
నీవలానడుస్తూ అటు వైపుగా వెళ్తావా..
ఆ తివాచి మనుగడే మటుమాయం...!
3

నీవు అలా కనిపిస్తావా..
అన్నినదులూ ధ్వనిస్తాయి...
నా దేహం లో గంటలు మ్రోగుతాయి.
అనంత ఆకాశం చిగురుటాకులా కదులుతుంది..
ఒక దివ్య మంత్రోచ్చరణప్రపంచమంతావ్యాపిస్తుంది..!

4

కేవలం నీవూ మారియునేనే..
కేవలం నీవూ... నాప్రేమే..
నా మాట విను..!

This is a translation of the poem La Reina (And Translation) by Pablo Neruda
Monday, October 30, 2017
Topic(s) of this poem: poetry
COMMENTS OF THE POEM
suresh CV chennuru vankadara

suresh CV chennuru vankadara

PRODDATUR, KADAPA DIST
Close
Error Success