Poola Bala Venkat

visakhapatnam
Poola Bala Venkat
visakhapatnam
Explore Poems GO!

అమృత కౌగిలి

సంవత్సరాలు వెళ్లిపోతున్నాయ్, చేతులూపేసి
జనం నిస్చేస్టులై చూస్తుండగా, తలపంకించి
వెలుతుర్లో ఆడుతున్నాం చీకటి క్రీడలు
వెళుతున్నాం వెలుతురున్న చీకటిలోకి
యవ్వన సవ్వడి తో కాల సర్పం కౌగిట్లోకి
అర్ధం కానీ జ్ఞానం లోకి, అర్ధజ్ఞానంలోకి
పాత లాంటి ఉత్త కొత్త సంవత్సరం
పిలిచింది ఉత్ప్రేరకం తీసుకుని ఉద్రేకంతో
జిజ్ఞాస జీవం పోసుకునే లోపే అజ్ఞానాన్ని అంటించుకుని
తెలుపులాంటి నలుపుని తలపులకి తాటించి
తలుపుమాటున సలుపు లాంటి వలపు తో సయ్యాటలాడి
మూలుగునే సంగీతం గా మూర్ఖ ప్రపంచం తో ములిగిపోయి
జ్ఞానం హద్దుల్లో మొద్దు నిద్దర లో మలిగి పోయే ముసలియువకుడా
లే.. లేచి, పో అలా పో, ఈ జగం నాది ఈ యుగం నాది
యవ్వన నిష్క్రియా ముష్కరుడా విశ్వమంతా నా విలాసమే
భాష నా శ్వాస వాఙ్మయమే నా ఉనికి విజ్ఞానం నా వాకిలి
అమృతం నా కౌగిలి - మరి గగన కుసుమమే నీ కది
Wednesday, August 19, 2020
Topic(s) of this poem: philosophical
READ THIS POEM IN OTHER LANGUAGES
COMMENTS

I Do Not Love You Except Because I Love You

Delivering Poems Around The World

Poems are the property of their respective owners. All information has been reproduced here for educational and informational purposes to benefit site visitors, and is provided at no charge...

4/19/2021 11:56:28 AM # 1.0.0.560