Can U Remember Me (Telugu) Poem by Thati pramod sai

Can U Remember Me (Telugu)

చెలి నేనెవర్ణని నన్ను అడిగావు కదూ చెబుతున్న విను..

నీ కనుపాపలు దాచిన కళలనడుగు నేనెవరో నీకు చెబుతుంది
నీ బుగ్గ పై జారిన కంటి నీటి బొట్టునడుగు నేనెవరో నీకు చెబుతుంది
నీ పెదవి పై మెదిలే నీ నవ్వునడుగు నేనెవరో నీకు చెబుతుంది
నిన్ను దాచే నీ సిగ్గునడుగు నేనెవరో నీకు చెబుతుంది..

నీ మాటనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ పాటనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ బాటనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ రాతనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది..

నీ కవితనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ కలముని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ కమ్మని కావ్యాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ కరములను అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది...

నీ ఆశని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ నిరాశానడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ నీడనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ నిశీదినడుగు నేనెవర్నో నీకు చెబుతుంది..

నీ పువ్వునడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ పాద స్పర్శ తాకిన పుడమినడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ ప్రేమనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ ప్రాణాన్నడుగు నేనెవర్నో నీకు చెబుతుంది..

నీ కోపాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ ద్వేషాల్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ ఉఉహలనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ ఉఊపిరినడుగు నేనెవర్నో నీకు చెబుతుంది...

నీ అడుగులనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ పరుగులను అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ పయనాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ హృదయాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది..

నీ రూపాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
నీ అద్దాన్ని అడుగు నేనెవర్నో నీకు చెబుతుంది
అప్పటికి నేనెవర్నో నీకు గుర్తు రాకపోతే...

చితి మంటల మీద ఉన్న నా చివరి శ్వాసనడుగు నేనెవర్నో నీకు చెబుతుంది..

Monday, April 24, 2017
Topic(s) of this poem: love,love and friendship,miss you
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success