నీ యెదలో అలా..(Telugu) Poem by Thati pramod sai

నీ యెదలో అలా..(Telugu)

నీ ప్రేమకి పరవశించి నా మనసు ఆకాశాన్ని తాకగా
ఉవ్వెత్తున ఎగిసి నా ఉఉహలు హరివిల్లుగా మారగా
ఈ ప్రపంచం చాలా చిన్నదిగా
నను కవ్వించు నిలిచిన బొమ్మగా
మా అమ్మ పిలుపులోని ఆప్యాయాయ తరంగాలుగా
తన్మయత్వంతో నా కనులు ఆనంద భాసుపాలు రాల్చువేళ
నీ కౌగిలిలో కలకాలం నిదురించానా

నా ముందొక వింత లోకం తోచగా..
అవదులులేని ఈ వర్ణనకి..
మౌనమే నను దరిచేరగ..
నిలువునా నేనొక జీవమున్న తారలా..
ప్రకృతి ఒడిలో పసి పాపలా..
చిగురించిన కొమ్మలా..
వికసించిన పువ్వులా...
నీ యెదలో అలా......

Thursday, April 27, 2017
Topic(s) of this poem: friendship,love
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Thati pramod sai

Thati pramod sai

Hyderabad
Close
Error Success