పుట్టిన రోజు కానుక
హిమవంతుని ఒడిలో ఒదిగే ప్రకృతి జీవ శిల్ప సౌందర్యం;
జడల అడవిలో సురధునిగా వెలసి ప్రాణవల్లభుడ్ని ఉత్తేజపరిచే శక్తిస్వరూపం;
లోకాన్నే బిడ్డగా చేసి వాత్సల్య గంగాజలంలో తడిపే లోకమాత ప్రేమ అపురూపం;
...
గాంభీర్యంలో సముద్రుడితో
సహనంలో భూదేవితో
అమితంగా ప్రేమించడంలో ఆకాశరాజుతో
ఆగ్రహంలో అగ్నిదేవుడితో
...
నా తరపున మీ కోసం ఈ మంత్రాక్షర నీరాజనం
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంటూ మంత్రాలే శుభలేఖలు రాయగ
పసుపు కొమ్ములు, పట్టు చీరలు.మట్టి గాజులు పండగని శుభప్రదం చేయగ
నక్షత్రాలు, తిధులు, రాశులు సరిచూసినారే,
...