గాంభీర్యంలో సముద్రుడితో
సహనంలో భూదేవితో
అమితంగా ప్రేమించడంలో ఆకాశరాజుతో
ఆగ్రహంలో అగ్నిదేవుడితో
సంకల్ప బలంలో వాయుదేవుడితో సమానులైన మీరు
ఈ వంశంలో పుట్టిన మానవ మకుటం
ఇలాంటి మహాత్ముడి గురించి రాయడానికి ఈ చిరు కవికి కష్ట సాధ్యమైన
కార్యమైనప్పటికీ నా మనసులో ఉద్భవించే అశ్రువులను అక్షరాలుగా చేసి, కవితగా మార్చి
మీకు చేస్తున్న అశ్రువార్చన
జీవిత రధాన్ని చాకచక్యంగా నడిపిన బ్రహ్మవా
కన్నీటి గంగను హృదయ ధిగ్భంధనం చేసిన ఈశ్వరుడివా
సంసార సాగర బరువుని అవలీలగా, వినోద లీలగ మోసిన మత్స్యావతారానివా
కాదు మరి
నమ్మిన సిద్ధాంతాలకి కట్టుపడి
కష్టాలకి భయపడకుండా, కన్నీలకి లొంగిపోకుండా
నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన రాజమార్గంలో నడుస్తూ,
ఎవరినీ లెక్క చేయక, అందరి లెక్కలు చుస్తూ
అమితంగా ప్రేమించి, అనుక్షణం తపించి
నిర్విరామంగా శ్రమించి, అనుకున్నది సాధించి
కుటుంబం కోసం సర్వసుఖాలను త్యజించి
సంసారంలోనే బైరాగిలా జీవించి
చివరకు శరీరం నశించి
సూర్యుడికి కూడ శాస్వతమైన అస్తమయం ఉంటుందని
నారాయణుడు కూడ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాడని
సూర్యనారాయణుడిగా పుట్తిన నేను అవిశ్రాంతంగా శ్రమించి
విశ్రాంతి కోసం హరుడి హృదయంలోకి వెళుతున్నానని
చెప్పకనే చెప్పి, మా హృదయ రాజ్యాలకి మహారాజువై
వెళ్ళిపోయిన మహా ఋషివి, మౌన మునివి
శివపార్వతులనే తల్లిదండ్రులుగా ప్రసాదించిన నీకు
ఉపనయన రూపంలో మీ నయనాలకి ఆనందం కలిగించి
రుణం తీర్చుకొనే అవకాశం కల్పించిన నీకు వందనం దేవా!
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem