నా తరపున మీ కోసం ఈ మంత్రాక్షర నీరాజనం
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంటూ మంత్రాలే శుభలేఖలు రాయగ
పసుపు కొమ్ములు, పట్టు చీరలు.మట్టి గాజులు పండగని శుభప్రదం చేయగ
నక్షత్రాలు, తిధులు, రాశులు సరిచూసినారే,
ముచ్చటగ ముహూర్తం పెట్టినారే,
వధూవరులను చూసి ముహూర్తానికే గర్వం పొంగుకొచ్చినాదే
తోటి స్నేహితులతో తన పెళ్ళి గురించి గొప్పలు చెప్పినాదే
పూర్ణకుంభమే కుంభకోణమై విరుల దేవతను సృస్ష్టించినారే
క్రిష్ణయ్యకు అర్పించడానికి అంతా సిద్దం చేసినారే
దశరధుడే మాధవుడికి మనువుని ఏర్పాటు చేసినాడే
నీరజకు పరిమళాలు అద్దడానికి జయక్రిష్ణుడి ని తీసుకొస్తున్నారే.
అమ్మ, అయ్యవారుల రాక కోసం ఎదురుచూస్తోంది బృందావనస్థానం
ఇంతలో వచ్చిన ఆ ధ్వయాన్ని చూసిన ముక్కోటీదేవతలు సంతోషించారు స్వయం
మిధున లగ్నంలో ఆవిర్భవించింది అమృతసాగరంలో ప్రయాణించాల్సిన మిధునం
ప్రజల కళ్ళ ముందు విరిసింది కని విని ఎరుగని ముచ్చటైన కళ్యాణం.
మానవ రూపంలో వచ్చిన శ్రీ క్రిష్ణుడు విరుల దేవత ఐన నీరజను వివాహమాడే మధురక్షణాన్ని వీక్షించడానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు అభినందనలు.ఆ మహదేవుడు మీ ఇరువురి కి సంతోషకరమైన అందించాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక శుభాకాంషలు.
ఇతి: శివం
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem