అమ్మానాన్నల అనురాగఫలం, వేదాద్రినరసింహుని ప్రసాదం
మిన్నంటిన ఉత్సాహం, వెన్నంటిన రామనామం
వెరశి క్లుప్తంగాపూర్ణకాలచక్రభ్రమణం
ఏడుపదులస్వీయజీవనచిత్రం.
1-తెలుగుపరిసరాలకి దూరంగా, భయంభయంగా,
అమాయకంగాఅనాలోచితంగా కాలం గడిపిన చిన్నప్పటి నర్సింగ్ రావును
ఆగాపూరా ఇంటిలో, నాంపల్లిబడిలో, సీతారాంబాగ్ గుడిలో
మంగల్ హాట్ అంగడిలో, కథలూ, హరికథలూ, నాటికలూ
లెక్కలేనన్ని ఆటలు, స్నేహాలూ, మధురమైన జ్ఞాపకాలదొంతరలు(1-10)
2-లాయర్ కాని లాయరు గా, ఇంజనీరు కాని ఇంజనీరుగా
కొండొకచో తెలుగు పండిత్ గా వ్యవహరింపబడిన
నేను చదువులో మాత్రంవెనుకబడ్డాను.
వేమన గ్రంధాలయము నాతెలుగుకి వెలుగులు ప్రసాదించింది.(10-20)
3-తెలిసీ తెలియని వయసులో, చిరుద్యోగములో చేరి
కుటుంబానికి దూరంగాగోదావరి చెంతన, జనారణ్యములో
బ్రతుకుతెరువుకై, ఈతరాకపోయినా ఏటికిఎదురీదుతూ
నీటిపారుదలరంగంలో స్థిరపడ్డాను(20-30)
4-అమ్మ మోస్తున్న ఆర్ధికపెనుభారానికి చేయూతనొసగి
బాధ్యతలని పంచుకొన్నాను
ఆగిపోయిన చదువుని పట్టుదలగా రాత్రికళాశాలలో
పూర్తిచేసి ఇంజనీరు నయ్యాను
చిరునవ్వుతో కష్టాలనెదురుకొనడం, నమ్మిన సిధ్ధాంతాన్ని
నిజాయతీగా ఆచరించడం అమ్మానాన్నల శిక్షణలోనేర్చుకొన్నాను (20-30) .
5-కాలమొక్కతీరుగా గడవదని మరొక్కసారినా జీవితం నిరూపించింది.
అమ్మనాన్నలని కోల్పోయి, ఒంటిచేతితో సంసారరధాన్ని నడుపుతున్ననేను
అర్ధాంతరంగా అనుకోనిప్రమాదంలోమరణంఅంచుకిచేరుకున్నాను.
రామనామజపం, స్థిరమైన చిత్తముతోడుగా కబళించేమృతువును
జయించి బ్రతుకువిలువను తెలిసికొన్నాను.(40-50)
6-అహర్నిశలు శ్రమించి, సాధించిన ఉద్యోగపు, పెద్దరికాలునేను కలలో కూడ
ఊహించనిగౌరవసత్కారాలు, కీర్తిప్రతిష్టలు, మన్ననలను ప్రసాదించాయి
హితులూ.సన్నిహితులూ, స్నేహితుల, తులలేనిసహకారము
నా జీవన ప్రస్థానాన్నిఉన్నతశిఖరాలకిచేర్చింది.(50-60)
ఉద్యోగ విరమణతో స్వస్వరూపజ్ఞానముకలిగి వా స్తవములోనికి ఒదిగిపోయాను
7-అలసి, సొలసి, నెమ్మదించి, పరిసరాలనిపరిశీలించి
మనవడు, మనవరాలువారిబాల్యచేష్టలలలోని ఆనందాలని పంచుటకై
సొగసైన కవిత్వరచనకు శ్రీకారం చుట్టాను
సహకరించని శరీరానికి ఔషధసేవతో మరమ్మత్తులు చేస్తూ,
వర్తమానాన్ని పొడిగిస్తూ, జగన్నాటకసూత్రధారిలీలలను గమనిస్తూ
రామచంద్రుడిని స్మరిస్తూ కాలము వెళ్ళబుచ్చుతున్నాను (60-70)
నాలోనేనై, అంతర్ముఖుడనై, వినమ్రుడనై నాడెబ్బది వసంతాల విశేషాలని
సహృదయులు, గుణగ్రహణపారీణులగు మీ ముందుంచుతున్నాను.
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem