అమ్మ పదం(On Eve Of Mother's Day) Poem by Narsimha Madiraju

అమ్మ పదం(On Eve Of Mother's Day)

రెక్కలు వఛ్చి ఎగిరిపోయిన తనయులని
తలచుకుంటూ, మనసు కుదుటపరచుకుంటూ
నిరీక్షించే అమ్మకు నారాక, ఆనందాలవాక
కాసేపట్లో కరిగిపోయిన అనుభూతి వీడుకోలు పలుకగా
దిగాలుగా వీధి చివర నిలుచున్న అమ్మ
కనుమరుగవుతున్న నిశ్చల చిత్రం
ఆప్యాయతకు నిలువెత్తునిర్వచనం
అనిర్వచనీయదుఃఖ సాగరతరంగం
తీసుకెళ్తున్న వాహనానికీ ఆందోళనపడే మనసుకీ
ఏంతెలుసు అదికడచూపని
విడతీయరానిబంధంవిడివడి, నాలోని
సిఃహభాగం శాశ్వతంగా మూగవోయింది
మమతలవంతెన దాటిచూస్తే అనంతమైనశూన్యం
అమావాస్య నిశీధిలా ఆవరించింది
ఇవ్వటమేతప్ప తీసుకోవటం తెలియని అమ్మకు
ఏమిచ్చి తీర్చగలను జన్మాంతరఋణం
నిర్వికల్పసమాధిలో మౌనంగానిలిచిన రసాకృతివినీవు
వాసంతసమీరంలో, వర్షపుహర్షంలో, హేమంతపు చిరుచలిలో
అమ్మరూపు మధురోహలలో లాలిస్తుంది
పసిపాపబోసినవ్వులో, తొలకరివేకువలో
మలయానిలపు హాయిలో అమ్మ నేనున్నానని అంటుంది
కలసిరానికాలానికి అలసిసొలసినకాయానికి
వేదనలభారానికి అమ్మపదం శ్రీరామరక్ష

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success