జయ శ్రీరామం Poem by Narsimha Madiraju

జయ శ్రీరామం

జయ శ్రీరామం సర్వకాలసర్వావస్థల యందు
రసనాగ్రాన నిలిచిన శబ్దమై, నిత్యసత్యమై, జపమై, తపమై
అహరహమూ కార్యానుకూలమై, ప్రేమమయమై,
అవసానసమయాన తులసితీర్ధమై, భక్తిసామ్రాజ్యమై
మనిషిమనుగడకి ఆలంబనై, సనాతనధర్మమై
అమ్మవారికితెలుపు ఆధ్యాత్మకీర్తనై, శివహృదయమై
దశరధుని మోహమై, సీతమ్మ ప్రేమయై, విశ్వామిత్రుని కర్తవ్యబోధయై
రావణబ్రహ్మకి సూక్ష్మంలో మోక్షమై, అన్ని చింతల బాపు తారకమంత్రమై
నేల నాలుగు చెరగులా విస్తరిస్తున్నది.
నేటిభారత సమరాంగణాన రామనామం ప్రాంతాలను, మతాలను
కులాలనూ పెనవేసి రామరాజ్యానికి రమణీయమైన రహదారిని పరుస్తున్నది.
అవినీతి అధర్మం ఆసరాగా, స్వార్ధమే పరమావధిగా జరుగుతున్న కుటుంబ పాలన
నుండి విముక్తిని ప్రసాదించి నీతినిజాయతీలకు పట్టం కడుతున్నది.
నేటిభారతం రామాయణమై, ఆదికావ్యమై, సకలజనశ్రేయమై
రసగీతమై, లోకానికి మార్గదర్శకమై, మానవత్వానికిమకుటాయమానమై
జగజ్జేగీయమానమైన ప్రభలతో విరాజిల్లుతున్నది.

READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success