మాదిరాజ వంశ పాధోధి చంద్రమా
మామక మనస్సంజాత మాదిరాజ హంసమా
నృసింహ క్రీడా చతురంగ తురంగమా
నిన్న మొన్నటి చిన్నారి పొన్నారి 'విలోకా'
నీ బుడి బుడి అడుగుల కదలిక కడలి అంచున అలలతో పోటీపడుతుంది
భువన మోహన రూపం నీది
ఆనందాన్ని పంచడం నీ హాబీ
నీ పెదాల కదలిక సవ్వడి, వీణా మృదు మధుర రవళి,
వీణా పాణి శుకాలపం పరవసింప జేయ గల రామశబ్డం
నీ ఆలోకనం లోకా లోకన విజిగీష చరాచర సృష్టికి,
'స్వప్న' జగత్తుని తలపింపజేసి, మురిపింపజేసి, మైమరపింప చేస్తుంది
నే హసనం మృదు మధురం, పరమ పావనమైన వ్యసనం
మల్లెల పరిమలం, గులాబీల లావణ్యంతో కలబోసిన
నీవు రాజుగ, మా రాజుగ, రారాజుగ
సరస్వతీ 'చరణ' చారణ చక్రవర్తిగ
సన్నీవేల్ లో పరిటాల ప్రభలు శత సంవత్సరాలు వెలిగంచాలని నీ తాతయ్య కల
ఆశీస్సులతో, కవితా సుమాశీసులతో జయోస్తు..
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem