తెలుగు భాషాదినోత్సవం (9-9-2021) Poem by Narsimha Madiraju

తెలుగు భాషాదినోత్సవం (9-9-2021)

తెలంగాణవైతాళికుని జన్మదినం
తెలుగుభాషాయోషకు పర్వదినం
తెలుగు సాహిత్యపు మహాప్రస్థానం
అమ్మఒడిలోని తొలి పలుకుబడి,
తరాల అంతరాల పలుకుల వారధి,
బతకమ్మను బ్రతికించిన కాళోజినుడి
శ్రీసీతారామకళ్యాణములోనిపానకం రుచి.
సరదాలదసరాలలో, దీపావళివెలుగులలో,
సంక్రాంతికాంతులలో వెలుగులీను ప్రాభవం.
కృష్ణాగోదారులపసిడిపంటల హరితహారం
శ్రావణ మాసపుశోభనాల పేరంటం.
హేమంతపు చేమంతుల పసిడిసోయగం,
హొయలు చిందించిన జానపదుల జనపదం
యాసల, పలుకుబడుల నుడికారం.
అవధాన భాషాయోష కరకంకణం.
కృష్ణరాయలవారి భువనవిజయములో వైభవంగా,
దిక్కులు పిక్కటిల్లునట్లు నినదించిన తెలుగుపద్యం.
శ్రీనాధుని సీసం, సూరన్న ద్విపదం అమోఘం.
విశ్వనాధుని రామకథ అపురూపం.
పివి, కాళోజి, వేటూరి, గిడుగుల,
తెలుగు భాషాభిమానం అజరామరం.
సంస్కృతం కలగసినతెలుగు అమృతం,
అందుకే కాళోజీని తలచుకొని,
అమ్మబాసవిలువతెలుసుకొని
గతమైన ఘనకీర్తిని వేనోళ్ళచాటుదాం.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success