Telugu Poem ఉప్పు నీళ్ళ సాక్షిగా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఉప్పు నీళ్ళ సాక్షిగా

Rating: 5.0

*ఉప్పు నీళ్ళ సాక్షిగా*

ఈవలి ఒడ్డున నేను
ఆవలి ఒడ్డున నువ్వు
అలలతో మాట్లాడుకుంటూ మనం
ఉప్పు నీళ్ళ సాక్షిగా
ఎప్పుడూ మబ్బుల్లో కలిసే వుంటాం

చేప పిల్లలు ఎగిరి దూకుతుంటే
పసితనం గిలిగింతలు పెట్టినట్టు నవ్వుకుంటాం

సుడిగుండంలో అలలు చిక్కుకుంటే
కలలు మునిగినట్టు బాధ పడతాం

సముద్రమంటే
మనలా.. దుఃఖాన్ని దాచుకున్న లోతు

కాదంటావా

~ పారువెల్ల ~
28-03-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success