Telugu Poem చరిత్ర Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem చరిత్ర

Rating: 5.0

* చరిత్ర *

మాట నేర్చిన మట్టి బెడ్డలు
ఒక్కో పాట పాడుతుంటయ్

ఆకలేమిటో తెలియకుండా
సరిహద్దులు అలుగుతుంటయ్

దుస్తులు కప్పుకున్న దేహాలు
కత్తులు దాచుకుంటయ్
ఇక మిగిలేదేముంటది మరక తప్ప.

రక్తం ఓ రంగు చుక్క
చరిత్రను రాసుకుంటూ పోతుంటది.

~ పారువెల్ల ~
20-05-2015

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success