Telugu Poem అమృతం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అమృతం

Rating: 5.0

* అమృతం *

కలిసే మొదలయ్యింది పయనం
నీళ్ళల్లో చేపల్లా ఈది
మబ్బుల్లో గువ్వల్లా యెగిరి

ఎండ తర్వాత వాన
వాన తర్వాత చలి
ఏ కాలం
ఎవరు పిలిస్తే వచ్చిందో అడగనేలేదు

ఆరిపోని చీకటి బాధనీ
జాడ తెలియని వేకువ గాధనీ
ఆరా తీయనేలేదు

కొమ్మను వీడి
రాలిపడుతున్న ఎండుటాకులా ఒకరం
మట్టిని చీల్చుకొని
పుడుతున్న లేత మొలకలా ఇంకొకరం
రుతువేదో మారినప్పుడు
దూరమెందుకవు తామో తెలియనేలేదు

చినుకుమీద మట్టికున్నంత ప్రేమ
మనకూ వున్నందుకు
దుఃఖ మంతా కవిత్వమేనని తెలిసింది

~ పారువెల్ల ~
21-01-2016

Thursday, November 10, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success