Telugu Poem మనోహరం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మనోహరం

Rating: 5.0

*మనోహరం*

రెక్కలున్నందుకు ఎగిరిపోదాం
నీళ్ల మధ్యలో తేలుతున్న మట్టి మీదకి

మౌనాన్ని మరపించే మాటలున్నందుకు
ముడిలేని హృదయాన్ని విప్పడం
కష్టం అసలే కానందుకు
ఒక్కొక్క మాటలో
మనసును చూసుకుందాం

ఇన్నాళ్లూ
ఇంత దూరం నడిచినందుకు
ఇప్పుడిలా
యెగిరి వచ్చినందుకు
కడలంత కష్టంలో
చినుకంత ఇష్టానికి తడిసిపోదాం

రాతిరి ఎప్పుడు పుడుతుందో
నిదుర ఎప్పుడు పడుతుందో
కనులు తెరిచిన హృదయంలో
రంగుల నెలవంక ఎలా పూసిందో
రెప్పలపై సీతాకోక చిలుకలేమైనా వాలి వెళ్ళాయో
సఖీ... నీకేమైనా గురుతుందా!

పారువెల్ల
11-12-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success