Telugu Poem తూకపురాళ్ళు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem తూకపురాళ్ళు

* తూకపురాళ్ళు *

నీకింత గౌరవమిచ్చేందుకు
నిన్ను కొలిచేందుకు
వాళ్ళు!
ఎప్పుడూ తూకపురాళ్ళు దగ్గరేఉంచుకుంటారు
తూగనందుకు నీకేదీ పట్టదు

అయినవాళ్ళ నుండి పొందనిది
బయటివాళ్ళ నుండి నువ్వెప్పుడూ ఆశించవు

ఉరుములు మెరుపులు
ఎక్కడో ఉరిమినా
ఇంకెక్కడో మెరిసినా
వెక్కిరింపులు పల్లమునే చేరుతుంటాయి
నీ వైపుకే పారుతుంటాయి

నీతో వున్నందుకు
నీ నీడ కూడా తెలికైపోతుంటది
నీ ఇష్టాలు కష్టాలు అన్నీ వట్టివే!

బంగారు విగ్రహమున్న చోట
నీకు ప్రసాదమూ దొరక్క పోవచ్చు
కొలతలంతే....! !

అయినా...
తూగనందుకు నువ్వెప్పుడూ బాధ పడవు

కాలమెప్పుడూ ఒకేలా ప్రవహించదని
నీకు తెలిసినందుకైనా
కాలమెప్పుడో నిన్ను కొలవకుండానే కొలిచి మొక్కుతుంది

లాభమో నష్టమో
నీకేదీ పట్టనందుకు
నీ త్రుప్తిని కొలిచే తూకపురాళ్ళను వెతికే పనిలో
అప్పుడు మళ్ళీ వాళ్ళే! !

~ పారువెల్ల ~
27-02-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success