Telugu Poem నడక మొదలయ్యాక Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నడక మొదలయ్యాక

*నడక మొదలయ్యాక*

ఏమని అనుకున్నావు
యెన్నని అనుకున్నావు
అలలు నీకోసం వచ్చాయని
కలలు నీకోసం పుట్టాయని
గాలి నీకోసం వీచిందని
భూమి నీకోసం తిరిగిందని
అప్పటికంతే తెలుసు నీకు

కాలాన్ని ప్రేమించాక
మోసం బుస కొడుతుంది

ముళ్లలాగే గుచ్చుకోవడం
జ్ఞాపకాలకూ తెలుసుగనుక
అప్పుడప్పుడూ
బందీ అయిన గతమంతా
బంధువై ఎదురొస్తుంది
అద్దం ముందు నిలబెడుతుంది
నడిచిన తోవ వేసిన అడుగులు
అద్దంలో పలకరిస్తాయి

ఇప్పుడు
అడుగులు వాటంతట అవే కదలాలని అనుకోవు
వెచ్చని గాయానికి వెన్న పూసి
మరో అడుగు వేసేందుకు మనసుండాలంతే

పారువెల్ల
13-12-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success