Telugu Poem కొన్ని జిందగీలంతే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem కొన్ని జిందగీలంతే

ఎండల్ల ఎదురొచ్చిన వాన చుక్క
కురిసినంత సేపైనా నిలబడని చుట్టమయ్యిండని
ఊరూర డప్పు కొడతై
అంతే మరి! కొన్ని జిందగీలు
కొంచెం సేపైనా కండ్లు మూసుకుంటయ్
నోరు బజార్ల పడేసి చెవులను గోడలకు అతికించుకుంటయ్

'వచ్చిండు'
'పోయిండు'
'ఏం పొడిచిండని'
ఎదగని నాల్కలమీద సూరీడు ఎంగిలై పోయిండు
అంతే మరి! కొన్ని జిందగీలు
ఎప్పటికీ కండ్లు మూసుకుంటయ్
నోరు బజార్ల పడేసి చెవులను గోడలకు అతికించుకుంటయ్

పారువెల్ల
07-04-2017

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success