Telugu Poem వర్ణగ్రహణం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem వర్ణగ్రహణం

ఎవరి మబ్బుల్ని వారే మూటగట్టుకోవాలట
ఎవరి వాకిట్లో వారే కురిపించుకోవాలట
మా వాడలో వీచిన గాలి మీ వాడలో వీస్తే తప్పే మరి!

అంతే మరి! !
వర్ణాలు కొన్ని ఉంటాయి
వర్గాలుగా వేరౌతూ అరుస్తుంటయ్
నువ్వు రాసుకున్న నాలుగు అక్షరాలకు
DNA పరీక్ష పెడుతుంటాయి
నువ్వు మారినా మారకున్నా
నీ అక్షరాల మతమే కాదు కులమూ మారాలిప్పుడు

అక్షర హాలికా
పైరుకు వాదమే ఎరువు

పున్నమి రేయి ఇది
స రస హృదయము నీది
కట్టుకున్న ఆలి విప్లవ కవయిత్రి
కవీ!
ఎటు పోదువో యెర్రని మల్లెలకోసం! !

అయ్యో!
అక్షరాలకెందుకో వర్ణగ్రహణం

పారువెల్ల
20-06-2017

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success