Telugu Poem కాగితం పడవ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem కాగితం పడవ

Rating: 5.0

*కాగితం పడవ*


మాసిన అద్దాన్ని చేతులతో తుడిచాను
జ్ఞాపకాలు తళుక్కున మెరుస్తాయనుకోలేదు.
మెరిసినట్టే మెరిసి కురిసాయి కూడా.
ఎటునుండి వచ్చిందో కాగితపు పడవ
చిన్నప్పుడు వాన నీటిలో నేను వదిలినదేనేమో! !
ఆప్యాయంగా తీసుకెళ్లింది అందమైన దీవిలోకి.

చేయి పట్టుకొని తోడుగా నడిచింది పసితనం
నడిచిన దారంతా ప్రేమగా ఎదురొచ్చింది
ఆడిన ఆటలన్నీ అక్కున చేర్చుకున్నాయి
చేసిన అల్లరంతా చిలిపిగా బుగ్గ గిల్లింది

అందరు నాకోసమే ఎదురు చూస్తున్నట్లనిపించింది
అంతా నాకోసమే పరితపిస్తున్నట్లనిపించింది.
ఏదీ మారలేదు, ఎవ్వరూ మారలేదు.
మారిందల్లా నేనొక్కడినేనేమో! !

జ్ఞాపకాలన్నీ అలలయినాయి
పగలు రాత్రులు లేని రోజులై వెళ్లిపోయాయి.
ఇక్కడే మునిగిపోతే బాగుండు
ఇలాగే తేలిపోతే బాగుండు
కానీ, రెక్కలగుర్రం రానే వచ్చింది.

ఎప్పటికప్పుడు తనకు తాను
అనువదించుకుంటున్న జీవితానికి
అప్పుడప్పుడూ దయ కలిగితే చాలు
నా కాగితపు పడవ మీద

*పారువెల్ల*
18-09-2017

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success