Telugu Poem చివరి మాట Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem చివరి మాట

Rating: 5.0

చివరి మాట

నువ్వు పున్నమిని పిలువు
కలువల్ని నిద్రలేపి వస్తాను నేను
హృదయానికి నాలుక ముడేసి
ఇంకొంచెం సేపు మాట్లాడుకుందాం మనం

ఎన్ని ఏళ్ళు వెంటపడ్డావో
ఇంకెన్నిసార్లు నన్ను వెంబడించావో
సఖీ!
ఏ మొహమాటాలూ వద్దు
ఏ క్షమాపణలూ ఇప్పుడొద్దు.
మనస్ఫూర్తిగా నీలో నేనొదిగిపోతాను.

నేను పుట్టినప్పుడే
నువ్వు నాకోసం రాసుకున్న ప్రేమ లేఖ
ఈరోజు ఎలాగైనా ఇస్తావని తెలుసు నాకు.
మెరుస్తున్న చుక్కలు
మౌనంగా వున్న వెన్నెల
కదులుతున్న మేఘాలు
ఊగుతున్న ఆకులు
నీతో మొదటిసారిగా గడుపుతున్న క్షణాలు
ఇవన్నీ నాకిప్పుడు చివరి జ్ఞాపకాలు.
ఇక ఎప్పటికీ నన్నునీసొంతం చేసుకో

పారువెల్ల
12-11-2017

Thursday, November 23, 2017
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success