Telugu Poem నేను అనే నేను Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నేను అనే నేను

నేను అనే నేను

అందమంతా నాదే 
అద్దంలో ఎప్పుడూ చూసుకోలేదు 

మాటలంటేనావే 
ఇప్పటికీ శీల పరీక్ష చేసుకోలేదు 

దారి పొడువునా నేనే 
అడుగుల మరకలెవరివో తెలుసుకోలేదు 

ఆకాశానికిరెక్కలిచ్చి 
పిట్టల్నిఎగరమన్నందుకు 

గాలికి పరుగులిచ్చి 
భూమిని తిరగమన్నందుకు 

నిప్పుకుమనసునిచ్చి 
మంచును కరగమన్నందుకు 

ఇప్పటికైతే 
అన్నీ నేనే
అంతా నేనే

*పారువెల్ల*
13-12-2017

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success