Telugu Poem ఆనందం Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఆనందం

Rating: 5.0

* ఆనందం *

చేతులకెంత స్వార్థమున్నా
తల మీద పందిరి
అందరికీ ఒకటైనందుకు
అందనంత దూరం ఉన్నందుకూ ఆనందం

వర్ణాలు ఎన్ని వున్నా
రక్తం ఎరుపైనందుకు

తేడాలు ఎన్ని వున్నా
మట్టికి తోడైనందుకు
మొక్కకు ఎరువైనందుకూ ఆనందం

'నువ్వు'
అనే ప్రశ్న పుడుతున్నప్పుడల్లా
'మరి నేను'
అనే ఆలోచన ఆనందం

~ పారువెల్ల ~
09-03-2016

Friday, November 11, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success