Telugu Poem వాన వెలిసింది Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem వాన వెలిసింది

Rating: 5.0

* వాన వెలిసింది *

మాటలు
ఆవిరవుతూ చేసే నిశ్శబ్దం

కనిపించనిగాయాలతో
ఒకేసారి ఇద్దరమూ ఓడిపోతూ
ఓ యుద్ధం ముగిసిపోయింది

ప్రశ్నలన్నీ నావే
ప్రతీ ప్రశ్నకూ జవాబు నీ వద్దే
నీ దగ్గర ప్రశ్నలసలే లేనందుకు
నాకన్నా మిన్నగా ప్రేమించబడ్డదెవ్వరు

వాన వెలిసినందుకు
మట్టిలో తీయని వాసన

~ పారువెల్ల ~
15-03-2016

Friday, November 11, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success