Telugu Poem మళ్ళీ ఓ సారి తడిసిపోనీ... Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మళ్ళీ ఓ సారి తడిసిపోనీ...

మాటలు కలుపుకున్నచోట
మనసులు కలుసుకున్నచోట
ప్రేమను పంచుకున్నచోట
మళ్ళీ మళ్ళీ తడిసిపోవాలనిపిస్తుంటది

దూరమెంత నడిచినా
భారమంతా విడిచినా
కాలమెంత కరిగినా
నీ తలపే తోడొస్తుంటది
నెలవంకై నాతో నడుస్తుంటది

ఇన్ని రోజులు నడిచిన దారి వెంబటి
మనం నాటితే మొలకెత్తిన అడుగులన్నీ
చల్లని పున్నమిలా తొంగి చూస్తుంటాయి
వెచ్చని వెన్నెలలా అలుముకుంటాయి

సఖీ! నేననే మనిషెలాగున్నా మనసులేమున్నా
ఆత్మలు పవిత్రంగానే మిగిలుంటాయి
మైలపడ్డ దేహాలు మట్టిలో శుభ్రమవుతుంటాయి.

అందుకే మళ్ళీ ఓ సారి తడిసిపోనీ...
ఇగిరిపోయేదాకా, ఇగిరి కురిసిపోయేదాకా.

పారువెల్ల
16-10-2016.

READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success