Telugu Poem మనసులొక్కటే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మనసులొక్కటే

ఇష్టం ఒక్కటే
నీ మీద నాకు
నా మీద నీకు

ప్రేమా ఒక్కటే
నీ మీద నాకు
నా మీద నీకు

గీత ఒక్కటే
నేను దాటలేనిదని
నీవు దాటరానిదని
ఇద్దరికీ తెలిసినదే

తెలియనిదల్లా
ఇద్దరమూ ఒక్కటేనని
ఇద్దరమూ ఒక్కటవ్వాలని
ఆరాట పడే మనసులకే
మన తలపులకే

పారువెల్ల
19-02-2022

Telugu Poem మనసులొక్కటే
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success