Telugu Poem మనం మాత్రమే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మనం మాత్రమే

Rating: 5.0

* మనం మాత్రమే*

చెలిమె లో జ్ఞాపకాల ఊట
ఇంకుడుగుంతలో ఒక్కో కన్నీట్టిబొట్టు
నానుండి నీలోకి
నీనుండి నాలోకి
ప్రాణం ప్రవహిస్తున్నందుకు
గాయమూ ప్రవహిస్తున్నందుకు

తీరాన్ని తాకి విరిగిన కెరటాలను
ఇప్పుడు మనం మాత్రమే అతికించ
గలం

ముళ్ళ పొదల మాటున మాట్లాడుకుంటున్న
గడ్డిపువ్వుల గుండె ఊసులు
మనం మాత్రమే వినగలం

నిష్కల్మషమైన రెండు మనసుల
కాంతి పరావర్తన క్రీడలో
ఎప్పటికీ మనం మాత్రమే జీవించగలం

~ పారువెల్ల ~
26-06-2015

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success