Telugu Poem తనివితీరని పయనంలో Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem తనివితీరని పయనంలో

Rating: 5.0

*తనివితీరని పయనంలో*

గురుతులన్నీ మరకలనుకొని
నువ్వు గుండెను కడిగేసుకున్నాక
కాలువలా పారుతూ వచ్చిన జ్ఞాపకాలు
నాలో ఇంకిపోయాయి

తెలియకుండానే
నాకు చెప్పకుండానే
నన్నెవరో కడిగేసుకున్నారని
నన్నెవరో చెరిపేసుకున్నారని
కాకి యెంగిలి కలత చెందింది

వాన నీటిలో నేనొదిలిన కాగితపు పడవ
ఇన్ని రోజుల తరవాత తిరిగి నా దగ్గరకొచ్చింది
పడవను
నా చిన్ని పడవను
ఎక్కి కూర్చున్నాక మబ్బులు కమ్ముకున్నాయి.
సరిహద్దుల్ని దాటినా దాటకున్నా
తీరాన్ని చేరినా చేరకున్నా
మనం
ఆత్మను ఇక్కడే వదిలేసినవాళ్ళం
భూమిని గుండ్రంగా తిప్పుతూ
మళ్ళీ మళ్ళీ ఇక్కడే కలుసుకునేవాళ్ళం

~ పారువెల్ల ~

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success