Telugu Poem ఎప్పటిలాగే Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఎప్పటిలాగే

Rating: 5.0

*ఎప్పటిలాగే*

కళ్ళు తెరవగానే
ఊపిరి తిత్తుల నిండా స్వచ్ఛమైన గాలిని నింపుకుంటావు

మొన్నటి ప్రేమను
నిన్నటి బాధను
భుజాన వేసుకొని గూడు వదులుతావు

అడుగులు రెక్కలయినందుకు
అలసిపోయేదాకా ఎగురుతావు

దుఃఖం నుండి మేల్కోని వెలుతురును
సుఖంలో నిదురించని రాతిరిని
ఓదార్చుతూ భూమి చుట్టూ తిరుగుతావు

గువ్వలతో పాటే గూడు చేరుకున్నాక
అక్షరాలలో ఒదిగిపొతావు

కడుపు నిండదు
నిదుర పట్టదు
నీ ఆరాటమంతా
ఒక్క ముగింపు వాక్యం కోసమే

~ పారువెల్ల ~
05-06-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success