Telugu Poem సఖీ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem సఖీ

* సఖీ *

నవ్వుతావు
ఎందుకో తెలియదు
బంతి పూలన్నీ తీసుకొస్తావు

ఎగురుతావు
ఎక్కడికో తెలియదు
జ్ఞాపకాల రెక్కల్లో గాలి నింపుకుంటావు

సీతాకోక చిలుకువై
రంగుల కలలు మోసుకొస్తావు
రెక్కలతో కనురెప్పల జోకొట్టిపోతావు

ఇటు
వాలిపోతున్న పొద్దు

అటు
వాడిపోతున్న దిక్కు

సఖీ!

బాధకెందుకో బంగారుపూత పూస్తావు
చిరునవ్వుతో

~ పారువెల్ల ~
12-06-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success