Telugu Poem మన్నించు.... ఓ ప్రేమా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మన్నించు.... ఓ ప్రేమా

Rating: 5.0

మన్నించు.... ఓ ప్రేమా!

ఎలా కలిసామో
ఎందుకు కలిసామో
కలిసే ఎందుకు నడుస్తున్నామో

ఎంతో కొంత అనుభవించాము
జీవితాన్ని తీయగానే చేదుగానో
అడుగులకూ ఎంతో కొంత తెలుసు
నువ్వు
నేను
మన ప్రపంచం

బరువంతా బయటకు పంపేసి
గుండెనిండా నన్ను మాత్రమే ఒంపుకుంటావు నువ్వు
చీకటి కళ్ళల్లో వెలుతురులా
నిన్ను మాత్రమే నింపుకుంటాను నేను

అద్దం ముందు మనం
అద్దంలో ఎడారి
ఓ చినుకు కోసం మనమింకా ఎదురుచూస్తున్నామని
తెలియని మేఘం ఒకటి కురవకుండానే వెళ్ళిపోయింది
పొడి పొడి ఆవేశాలతో మబ్బులు
ఎక్కడా తడి లేదు

జీవితాన్నే విడిచి నడిచి వెళ్ళాక
దూరం ఎంతైతే యేమిటి

అయినా.....
అమాస చీకటి మీద ఏ కోపమూ లేదు నీకు
పున్నమి వెన్నెల మీద ఏ ఆశ లేదు నాకు

కలగానో
కథగానో
అనుకోకుండానో
మట్టిలో.....నే ఇంకిపోయినా
మాటేదో వినాలనుకుంటావు
కళ్ళల్లో నేను
చేతిలో బూడిద
దుఃఖం ఆకాశమవుతుంది నీకు

పారువెల్ల
17 August 2016

Saturday, November 12, 2016
Topic(s) of this poem: august
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success