♡ నిజం ♡
నా పక్కనే ఉన్నావుగా
మాటల్లో
పాటల్లో
ఊహల్లో
ముచ్చట్లన్నీ తెచ్చి
ఎన్ని చెప్పావో
ప్రియా.....!
మరి
ఈ ఒక్క నిజం ఎందుకు దాచావ్? !
కాలం
తేలి పోతుందని
జారి పోతుందని
గుండెలో
జ్ఞాపకాల బరువులేసి
పారిపోతుందని
~ పారువెల్ల ~
( 2012)
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem