Telugu Poem తవిక Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem తవిక

* తవిక *

నీలి సాగరంలో చుక్కల్ని తుంచి
నా ప్రియురాలి సిగలో పెడితే

నా కొత్త పెళ్లి కూతురికి
బంగారు కుండలో వెన్నల తలంబ్రాలు తెస్తే

చుక్కల చురకత్తుల చూపుల్ని
నా యెద వెండి గోళ్ళతో గిల్లితే

నా కలం వరండాలో పడుకొని
నీలాకాశంలో చుక్కల అలల్ని లెక్కపెడితే

నా మది కురిపిస్తున్న ఆనందపు రక్తాక్షరాలని


పూల హారం చేసి పూజారికి సమర్పిస్తే

కారు మబ్బుల్లో జలకాలాడుతున్న
నా కారు టైరుకి వెన్నల ముళ్ళు గుచ్చుకుంటే

నేను కట్టే కప్పం
నవ సమాజానికి నేనిచ్చే ఓ కవితా పుష్పమైతే
ఇదేనా కవిత్వం
ఇది నా పైత్యం

~ పారువెల్ల ~

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success