నువ్వు తప్ప
నువ్వు చేస్తున్నప్పుడు తప్ప
అదే, చూస్తున్నప్పుడు తప్పనిపిస్తది!
నీ ముందు నిలుచున్న అద్దంలో
నువ్వు కనబడనందుకు ఒప్పనిపిస్తది! !
నువ్వు చెప్పినదేదో చేయబడనందుకు
నువ్వు నచ్చినదేదో మెచ్చబడనందుకు
నీకిప్పుడు పురిటి నొప్పులు!
ఆకాశం ఊడి
నెత్తిన పడనందుకు
నేల కాళ్ళను వీడి
పారిపోనందుకు
నీకిప్పుడు సంతోషమే! !
~ పారువెల్ల ~
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem