Telugu Poem నువ్వేనా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నువ్వేనా

Rating: 5.0

* నువ్వేనా *

చిరిగిన ఆకాశాన్ని
మళ్ళీ మళ్ళీ కుడుతున్నది నువ్వేనా
పగిలిన భూమిని
మళ్ళీ మళ్ళీ అతికిస్తున్నది నువ్వేనా

ఉరికే అలల్లో
ఊగే తీగల్లో
నవ్వే పువ్వుల్లో
వెలిగే తారల్లో
వాయువులో ఆయువులో
దాగున్నది నువ్వేనా

నల్లని కన్నుల్లో కురిసిన కలలకు
రంగులద్దినది నువ్వేనా
కవీ...!
ఆరిన జ్ఞాపకాన్ని వెలిగించి
అమృతాన్ని కురిపిస్తున్నది నువ్వేనా

~ పారువెల్ల ~
(2014)

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success