Telugu Poem నేను, నా చరిత్ర Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem నేను, నా చరిత్ర

* నేను, నా చరిత్ర *

వ్యసనం వ్యామోహం
నన్నేం చేసిందో నీకు తెలియదా

ప్రపంచాన్ని జయించిన నా ప్రస్థానం
నాకేమిచ్చిందో నీకు తెలియదా

కుత్తుకలు కోసి, తలలు తెగ నరికిన నా కత్తి
ఏ చెట్టుకింద ఏడ్చిందో నీకు తెలియదా

శవమై నేనింకా కుళ్ళుతూనే ఉన్నా
అయినా...
పువ్వుల్లో నవ్వుతున్నా
ఆకుల్లో గాలినై కదులుతున్నా

విను...
నా గతం నిషిద్ధ సంగీతం కాదు
నా శవం నిశ్శబ్ద విప్లవం

~ పారువెల్ల ~
17-04-2013

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success