Telugu Poem గులకరాళ్ళు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem గులకరాళ్ళు

Rating: 5.0

* గులకరాళ్ళు *

నలుగురిలో
నవ్వుతూ నవ్విస్తూ నేను
చీకటి రాత్రుల్లో ఒక్కడినై ఏడుస్తూ నేను
నువ్వు లేకుండా

ఇప్పుడెందుకో
ఏ గాలి పలకరించదు
ఏ వెన్నెల కనిపించదు
మనసు ఎండకు ఆరబెట్టినట్లయ్యింది
మాడి మశై పోతుందేమో!

నీకు మాత్రం
మనసుకు విప్పలేక ముసుగు కప్పుకొని తిరుగుతూ
అలిసి, కాలంతో కలిసిపోవడమే శరణ్యమయ్యింది

వెతుకు నేస్తం
ఒక్కసారి! ఎక్కడున్నావో వెతుకు
త్వరగా వెతుకు
కాటికి కాళ్ళు చాపే లోపు
కాలి బూడిదయ్యేలోపు
ముసుగు నీడను మోస్తున్న మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతుకు

కాలం కదిలి వెళితే
నునుపెక్కిన గులకరాళ్ళ సాక్షిగా
నిజమే చెప్తున్నా
ఒక్కసారి! వెనక్కి తిరిగి చూడు నీ కళ్ళతోనే

నాకిప్పుడు ఆ జ్ఞాపకాలు
ఎండిన వాగులో ఏరుకున్న గులకరాళ్ళు
మింగుడు పడనంత చేదుగా ఉన్నా
నన్ను మరమ్మతు చేసే గుళికలవుతున్నాయి
అవును మంచికే...
కొన్ని రోజులు ఎప్పటికీ మంచివే.

~ పారువెల్ల ~
05-09-2013

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success