Telugu Poem మనసు' కథ Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem మనసు' కథ

Rating: 5.0

* 'మనసు' కథ *

ఏ ఎండకో ఇది నీడనిస్తుంది
ఏ వానకో ఇది గొడుగు పడుతుంది
ఆశల రెక్కలు రాలి నేల పాలైతే
ఆకాశానికేసి చూస్తూ అర్థిస్తుంది
రంగులు మార్చే కాలం ముందు
హంగులతో ముస్తాబవుతుంది

ఏదో వెలితి వెన్నంటే ఉంటుంది
పొద్దు పోనీయక
నిద్దుర రానీయక
సద్దు చేస్తూనే ఉంటుంది
ఆశను వెంట పెట్టుకుని, మనసును గాయం చేస్తూ
ప్రతి నిత్యం తొంగి చూస్తూనే ఉంటుంది

~ పారువెల్ల ~
03-09-2012

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success