Telugu Poem బాధంతా Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem బాధంతా

Rating: 5.0

* బాధంతా... *

దేహానికి ప్రాణం పోసుకున్నందుకో

నా
కాళ్ళు బెణికినందుకో
అడుగులు జారినందుకో

ఉసురు తరిమితే బాధ తడిమితే
నేను
రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినందుకో

ఆకాశం చెరిసగమై గోడ కట్టుకున్నందుకో
దూరాలు దూరాన్ని మలిపేసుకోనందుకో
తేనె పూసుకొని చూస్తున్న ఎదురు చూపుల్లో
నీ
కళ్ళు ఆరిపోతున్నందుకో

గుండె సముద్రమయినందుకో
నీ
కంటి ఉప్పునీళ్ళకు ఏ రాయీ కరగనందుకో

దిగులు మొత్తం కొంతే
బాధంతా
నా
చీకటి దేహంలో వజ్రం నీవైనందుకే

~ పారువెల్ల ~
07-03-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success