* ద్విముఖాలు *
అవని
ఆకాశం
ఆశల రెక్కలతో ఎగురుతూ నీవు
ఈ మట్టిలో మట్టితో నేను
బంధం
అనుబంధం
వలపుల తలపులను వడబోస్తూ నీవు
తెరిచిన పుస్తకంలా మనసుతో నేను
రాగం
అనురాగం
వ్యర్ధ ప్రేలాపనల అల్లరి చేస్తూ నీవు
పల్లవులు మనోహర దృశ్య చరణాల గానంలో నేను
ప్రేమ
పారవశ్యం
మధుర స్మృతుల మైకంలో నీవు
మానని గాయాన్ని మోసుకుంటూ నేను
కల
నిజం
నఖిలీ నవ్వుల నగిషీలతో నీవు
ఆత్మీయ పలకరింపుల భావావేశంతో నేను
~ పారువెల్ల ~
30-11-2012
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem